గుంటూరు: త్వరలో 1,700 వైద్యుల పోస్టులను భర్తీ చేయనున్నట్లు వైద్య విద్యాశాఖమంత్రి సుదర్శన్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ 200మంది వైద్యులకు పదోన్నతులు కల్పించనున్నట్లు చెప్పారు. సుదీర్ఘంగా సెలవుల్లో ఉన్న వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
రూ.3.5 కోట్లతో క్యాథలాగ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సుదర్శన్ రెడ్డి తెలిపారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రిలో మిలీనియం బ్లాక్‌కు రూ.5 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.