శ్రీశైలం: హఠకేశ్వరం ఆలయంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం ఉదయం ఆలయం తెరవగానే యువకుడి శవం రక్తపుమడుగులో ఉండడాన్ని గమనించిన పూజారి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గుప్తనిధుల కోసమే యువకున్ని నరబలి ఇచ్చి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ యువకుడు ఏ జిల్లాకు చెందినవాడోనని పోలీసులు మొదట ఆరా తీస్తున్నారు.