జగన్ యాత్రను ఎలా అనుమతిస్తారు: కె చంద్రశేఖర రావు

సమైక్యవాదం అంటేనే ప్రజలు భగ్గుమనే పరిస్థితి పల్లెల్లో ఉందని చెప్పారు. డీజీపీ తమాషా చేస్తున్నారా? అంటూ మండిపడ్డారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ హైదరాబాద్‌లో సభ పెడతామంటే అనుమతివ్వరని, తాను ఓయూ క్యాంపస్‌కు వెళ్తానంటే వద్దంటారని, తెలంగాణ గడ్డపై తెలంగాణ వాళ్లను తిరగనివ్వరని, అదే చంద్రబాబు, జగన్‌లను మాత్రం తిరగనిస్తారని, పైగా వాళ్లు పర్యటిస్తుంటే జేఏసీ నేతలను, తెలంగాణవాదులను ముందస్తుగా అరెస్టు చేస్తున్నారని ఆయన అన్నారు. తాను కూడా వంద కార్లతో, గూండాలతో వెళ్తానని, సీఎం ఎలా ఆపుతారో చూస్తానని అంటూ ఢిల్లీలో సవాల్ విసిరారు. ఆంధ్రా ప్రాంతం వారిని తెలంగాణలో పర్యటించవద్దని తాము అనడంలేదని, అయితే, లోక్‌సభలో తెలంగాణకు వ్యతిరేకంగా నినాదాలిచ్చిన జగన్ ఈ ప్రాంతంలో పర్యటిస్తే ఉద్రిక్తత పెరుగుతుందని కేసీఆర్ తెలిపారు. మూడో కూటమి కార్యకలాపాల్లో టీఆర్ఎస్ భాగస్వామిగా ఉంటుందా? అని ప్రశ్నించగా తమకు రాజకీయ ఫ్రంట్ కంటే తెలంగాణ ఫ్రంటే ముఖ్యమని, రాజకీయంగా ఏమై పోతుందో మాకు అవసరం లేదని, తమది ఫక్తు రాజకీయ పార్టీ కాదని, తెలంగాణపై అసెంబ్లీలో, లోక్‌సభలో వాణి వినిపించడం కోసమే మేం రాజకీయ ప్రక్రియను ఒక సాధనంగా వాడుకుంటున్నామని, చౌకబారు రాజకీయాల పట్ల మాకు ఆసక్తి తక్కువ అని బదులిచ్చారు. తమకు అందిన సమాచారం మేరకు శ్రీకృష్ణ కమిటీకి వచ్చిన నివేదికల్లో 96 శాతం తెలంగాణ ఏర్పాటును కోరుతూ వచ్చినవేనన్నారు.


Click it and Unblock the Notifications