కెసిఆర్ సీమాంధ్రలో తిరగవచ్చు: అనంత

K Chandrasekhar Rao
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కూడా సీమాంధ్రలో పర్యటించవచ్చునని కాంగ్రెసు అనంతపురం పార్లమెంటు సభ్యుడు అనంత వెంకట్రామి రెడ్డి అన్నారు. కడప కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తెలంగాణలో ఓదార్పు యాత్ర చేపట్టడంపై ప్రతిస్పందిస్తూ ఆయన గురువారం మీడియా ప్రతినిధల సమావేశంలో ఆ విధంగా అన్నారు. యాత్రలు ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా చేయవచ్చునని ఆయన అన్నారు.

కెసిఆర్ రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో తిరిగితే తమకేమీ అభ్యంతరం లేదని ఆయన అన్నారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని తాను ముఖ్యమంత్రి కె. రోశయ్యను కోరినట్లు ఆయన తెలిపారు. వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వడంపై కెసిఆర్ ఇటీవల తీవ్ర అభ్యంతరం చెప్పారు. తమకు అనుమతి ఇవ్వని ప్రభుత్వం జగన్ యాత్రకు ఎలా అనుమతిస్తుందని ఆయన ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+