వైయస్ జగన్ పై రోశయ్య ఆగ్రహం

శనివారం సాయంత్రం ప్రజాపథంపై మంత్రులతో సీఎం సమావేశమయ్యారని, అనంతరం వట్టి, పితాని సహా పలువురు మంత్రులు సీఎంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారని, పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ చేసిన వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మంత్రులను అడిగారని సమాచారం. ఇప్పుడు కూడా రాష్ట్రంలో వైయస్ ఏర్పాటు చేసిన మంత్రివర్గమే ఉంది కదా, జగన్ ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు ఖండించాల్సిన బాధ్యత మీపై లేదా ఆయన అన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వైయస్ ఉన్నప్పుడు కూడా కొత్త కార్యక్రమాలు చేపట్టలేదని, అందుకే ఇప్పుడు కూడా చేపట్టలేదని, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన అన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications