రవీందర్ కౌర్ పై తెలంగాణవాదుల ఫిర్యాదు

సోమవారం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన శ్రీకృష్ణ కమిటీ సభ్యులు రవీందర్ కౌర్, అబు సలే షరీఫ్ మంగళవారం కర్నూలు జిల్లాలో పర్యటించారు. వారు వెల్దుర్తి మండలంలో ఓ గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. వివిధ సామాజిక వర్గాలకు, వృత్తులకు చెందిన వ్యక్తులతో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడితే కలిగే లాభాలు ఏమిటి, నష్టాలు ఏమిటి అనే విషయాలపై వారు ప్రజల నుంచి అభిప్రాయాలు కోరారు. తమ పర్యటన సంతృప్తికరంగా ఉందని రవీందర్ కౌర్ చెప్పారు.












Click it and Unblock the Notifications