కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం పైడికొండ శివారులో అనూరు వద్ద క్వారీలో ఆదివారం జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. క్వారీలో పెచ్చులు వూడిపడటంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రానైట్ క్వారీ ప్రమాదం తర్వాతే ఇటువంటి ప్రమాదం జరగడం ఇదే. ఫిబ్రవరిలో జరిగిన ఈ ప్రమాదంలో 12 మంది కార్మికులు మరణించారు.