వైయస్ గొప్ప ముఖ్యమంత్రి: రోశయ్య ప్రశంస

ఉపాధి అవకాశాలు పెంచేందుకు అనంతపురం జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తీసుకువస్తామని తెలిపారు. జిల్లా ప్రజల దాహార్తి తీర్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికే దక్కుతుందని అనంత ఎంపీ అనంతవెంకటరామిరెడ్డి అన్నారు. వైయస్ఆర్ రుణం ఎప్పటికీ తీర్చుకోలేదని అన్నారు. రాయదుర్గంలో ఆదివారం జరిగిన ప్రజాపథంలో ఆయన మాట్లాడారు.
అనంతపురం ప్రజల నీటి అవసరాలను తీర్చడానికి దివంగత ముఖ్యమంత్రి వైయస్ ఆర్ పలు పథకాలను చేపట్టారని మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. మంచినీటి పథకాల కోసం కేటాయించిన నిధులను సకాలంలో మంజూరు చేసి, ఈ పథకాలు పూర్తయ్యేందుకు కృషిచేయాలని సీఎంను ఆయన కోరారు.












Click it and Unblock the Notifications