Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆట ఓంకార్ పై హెచ్ఆర్సీకి ఫిర్యాదు

Omkar
హైదరాబాద్: జీ తెలుగు టీవీ చానెల్ లో ప్రసారమవుతున్న ఆట కార్యక్రమాన్ని చుట్టుముడుతున్నాయి. ఆ కార్యక్రమాన్ని ఆరోపణల నీలినీడలు ముసురుకుంటున్నాయి. ఆట నిర్మాత, యాంకర్ ఓంకార్ తనను మోసం చేశాడని ఆరోపిస్తూ శ్రీరామ్ రెడ్డి అనే కొరియోగ్రాఫర్ మానవ హక్కుల కమిషన్ కు గురువారం ఫిర్యాదు చేశారు.

చిన్న పిల్లలతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారని ఈ కార్యక్రమంపై ఇప్పటికే ప్రజా సంఘాలు హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశాయి. పసి పిల్లలతో చీదరించుకునే విధంగా చిందులు వేయిస్తూ, అర్థ నగ్న నృత్యాలు చేయించడంపై ప్రజా సంఘాలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. ఈ ఫిర్యాదుపై ఈ నెలాఖరున తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని మానవ హక్కుల కమిషనర్ సుభాషణ్ రెడ్డి చెప్పారు. ఈ స్థితిలో ఓంకార్ పై శ్రీరామ్ రెడ్డి ఫిర్యాదు చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+