రాజా కోసం ఢిల్లీ చేరుకున్న కరుణానిధి

ఈ కుంభకోణం వివరాలివి: ద్ర ప్రభుత్వం 2007లో మరికొన్ని కంపెనీలకు కూడా టెలికం సేవల నిర్వహణకు లైసెన్స్‌లు ఇవ్వాలని నిర్ణయించినప్పుడు టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. అర్హత ఉన్న కంపెనీలను ఆహ్వానించి, పోటీ పెట్టి అధిక ధర ఎవరు ఆఫర్ చేస్తే వారికే స్పెక్ట్రమ్ లైసెన్స్ ఇవ్వాలని సూచించింది.
అయితే ఈ సూచనను తుంగలో తొక్కిన టెలికం మంత్రి రాజా ఎవరు ముందుగా వస్తే వారికే లైసెన్స్ ఇవ్వాలని నిర్ణయించారు. పైగా 2001లో తొలివిడత లైసెన్స్ జారీ చేసినప్పుడు వసూలు చేసిన రేట్ల ప్రకారమే స్పెక్ట్రమ్ ఫీజును కూడా వసూలు చేయాలని డాట్ (టెలికం శాఖ)ను ఆదేశించారు. వాస్తవానికి 2001లో దేశవ్యాప్తంగా టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య 40 లక్షలు కాగా 2007-08నాటికి ఈ సంఖ్య 35 కోట్లకు చేరింది. టెలికం సర్వీసులకు పెరుగుతున్న డిమాండ్‌ను రాజా ఏ మాత్రం పట్టించుకోలేదు.
స్పెక్ట్రమ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసిన కంపెనీల్లో రాజాకు సన్నిహితులుగా భావిస్తున్న యూనిటెక్, స్వాన్, లూప్, డాటాకమ్ కంపెనీలు కూడా ఉన్నాయి. ఇందులో యూనిటెక్ ఒక్కటే అరడజను కంపెనీల పేర్లతో లైసెన్స్‌ల కోసం వేరువేరు సర్కిళ్లలో దరఖాస్తు చేసింది. నిజానికి యూనిటెక్, స్వాన్ ఈ రెండు కంపెనీలకు టెలికం రంగంలో పూర్వానుభవం ఏ మాత్రం లేదు.












Click it and Unblock the Notifications