కోల్ కత్తా: పశ్చిమ బెంగాల్ లోని లాల్ గఢ్ లో వేర్వేరు సంఘటనల్లో ముగ్గుర్ని మావోయిస్టులుగా అనుమానిస్తున్నవారు కాల్చిచంపారు. జర్గాంలోని స్థానిక కాంగ్రెసు నేత వికాశ్ మహతోను కొందరు ఇంటినుంచి బయటకు లాక్కొని వచ్చి కాల్చిచంపారు. అనంతరం పోలీసులకు వ్యతిరేకంగా హంతకులు నినాదాలు చేసి పారిపోయారు.
శంకర్ పాల్, హరిపాద మహతో అనే మరో ఇద్దర్ని కూడా ఇదే ఫక్కీలో హత్య చేయడం లాల్‌గఢ్ ప్రాంతంలో ఉద్రిక్తతలకు దారి తీసింది.