తిరుమల: గత నెల 22వ తేదీన బయటపడ్డ శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కుంభకోణంపై విజిలెన్స్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. గత మూడు పాలకమండలి హయంలో విధులు నిర్వహించిన ఉద్యోగులపైనా దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కుంభకోణంలో సుమారు రూ.25 లక్షలకు పైగా చేతులు మారినట్లు సమాచారం.
విచారణలో తవ్విన కొద్ది అధికారుల అక్రమాలు బయటపడుతున్నాయి. అవినీతికి పాల్పడినవారిలో డిప్యూటీ ఈవోలు ఏఈవోలు, సూపరింటెండెంట్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. విజిలెన్స్ అధికారులు రహస్యంగా విచారణ జరుపుతున్నారు.