కసబ్ కు ఏ శిక్ష వేస్తారో తేలేది కొన్ని గంటల్లో...

Ajmal Kasab
ముంబై: 170 మందికి పైగా బలి తీసుకున్న ముంబై దాడిపై ప్రత్యేక కోర్టులో కొనసాగిన విచారణలో పాకిస్తాన్ ఉగ్రవాది కసబ్‌ను దోషిగా తేలింది. గురువారం సాయంత్రం లోపు శిక్ష ఖరారు కానుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముంబాయిలోని ప్రత్యేక కోర్టు చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

ఇన్నాళ్లూ ఎన్నో మలుపులు, మరెన్నో ఆసక్తికర కోణాల గుండా పరుగులు పెట్టిన ఈ ప్రత్యేక విచారణ బుధవారంతో ముగియడంతో 22 ఏళ్ల కసబ్ భవిష్యత్తును ఈ రోజు తేల్చి వేయనుంది. న్యాయస్థానంలో ముందూ వెనకా ఆలోచించకుండా కసబ్ చేసిన నేరాంగీకార ప్రకటన, అతని నేర నిర్థారణలో కీలక భూమిక పోషించిందని, దోషిగా నిలబెట్టిందని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎమ్ఎల్ తహిల్యానీ వెల్లడించారు.

ఈ దాడిలో పాక్ కేంద్రంగా పని చేస్తున్న లష్కరే తాయిబా నిర్వహించిన పాత్ర గురించి, పొరుగుదేశం నుంచి అందిన రక్షణ ఉపకరణాల గురించి కసబ్ తన వాంగ్మూలంలో అనేక విషయాలు పేర్కొన్నాడని..అవే దోష నిర్థారణకు ఉపకరించాయని తెలిపారు.

ఈ విషయాలను కసబ్ తనకు తానుగా బయటపెట్టాడని, దీని వెనక ఎవరి ఒత్తిడీ లేదని తహిల్యానీ స్పష్టం చేశారు. పోలీసుల బలవంతం మీదనే తాను ఆ విదంగా ప్రకటించాల్సి వచ్చిందన్న కసబ్ వాదనను ఆయన కొట్టివేశారు. మెజిస్ట్రేట్ చాంబర్‌లో తన వాంగ్మూలం నమోదు చేసే సమయంలో పోలీసులు కూడా ఉన్నారన్న కసబ్ ఆరోపణను ఆయన తేలిగ్గా కొట్టిపడేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+