న్యూఢిల్లీ: పార్లమెంటు సభ్యుల ఎంపీ లాడ్స్ కేటాయింపును సుప్రీంకోర్టు గురువారం సమర్థించింది. పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో దీర్ఘకాలిక అభివృద్ధి కోసం ఒక్కో ఎంపీకి రూ.2 కోట్లు నిధులు కేటాయింపు రాజ్యాంగ బద్ధమేనని ధర్మాసనం పేర్కొంది.
నిధుల కేటాయింపు రాజ్యాంగ విరుద్ధం కాదని, దాన్ని రద్దు చేయటం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిధుల విషయంలో అవకతవకలకు పాల్పడే ఎంపీలపై పార్లమెంట్ చర్యలు తీసుకోవచ్చని ధర్మాసనం వ్యాఖ్యానించింది.