హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ సాక్షిపై రోశయ్య మండిపాటు

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ సాక్షి దినపత్రికపై ముఖ్యమంత్రి కె. రోశయ్య తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెసు పార్లమంటు సభ్యుడికి చెందిన పత్రిక పని కట్టుకుని ప్రబుత్వంపై వ్యతిరేక కథనాలు రాస్తున్నా మంత్రులు ఖండించడం లేదని ఆయన గుర్రుమన్నారు. ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదన్న రీతిలో ఇష్టమొచ్చినట్లు రాస్తున్నా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెసు పార్టీకి చెందిన వారై ఉండీ ఇటువంటి అసత్య కథనాలు రాయడమేమిటని ఆయన నిలదీసినట్లు తెలిసింది. ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో సుప్రీం కోర్టు న్యాయమూర్తితో విచారణ చేయిద్దామా అని ప్రశ్నించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి అధ్యక్షతన గురువారం మంత్రివర్గ సమావేశం వాడి వేడిగా సాగింది. గురువారం మంత్రి వర్గ సమావేశంలో చోటు చేసుకున్న ఈ సంఘటనపై శుక్రవారం వార్తాకథనాలు ప్రసారమయ్యాయి.

ఫీజుల రీఎంబర్స్‌ మెంట్‌, ఉపకారవేతనాల అంశం చర్చకు వచ్చినప్పుడు కాంగ్రెసు ఎంపీకి చెందిన పత్రికలో వచ్చిన వరుస కథనాలను రోశయ్య ప్రస్తావించినట్లు తెలుస్తోంది. వార్తల కటింగ్‌లతో కూడిన కట్టను మంత్రుల ముందుంచారు. అందులో రాసిన కథనాలను మంత్రులకు చదివి వినిపించారు. వాటిని ఖండించాల్సిన బాధ్యత మంత్రులకు లేదా అని ఆయన అడిగారు. తాను ఈ పదవిని కోరుకోలేదని, ఒక దురదృష్టకర సంఘటన నేపథ్యంలో అధిష్ఠానం బాధ్యతలు అప్పగించిందని, అయినా మనకు వ్యతిరేకంగా రాసే వాళ్ళు మనవాళ్ళెలా అవుతారని ఆయన అన్నట్లు సమాచారం. ముగ్గురు మంత్రులు సర్దిచెప్పుకోవడానికి ప్రయత్నించినా ముఖ్యమంత్రి వినలేదని, వారిపై తీవ్రంగా వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X