తిరుపతి: చిత్తూరు జిల్లా చంద్రగిరి వద్ద ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఎదురెరుగా వస్తున్న ఆర్టీసీ బస్సు-వ్యాన్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులది నెల్లూరు జిల్లా శివాజీనగర్.
నెల్లూరు మున్సిపాల్ అటెండర్ మస్తాన్, డ్రైవర్ కొండయ్య, దివ్య, వంశీ, మౌనిక తదితరులు ఈ ప్రమాదంలో చనిపోయినట్లు గుర్తించారు. గాయపడిన వారిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.