కోస్తా ఆంధ్ర తీరానికి మినీ సునామీ?

Mini Tsunami
హైదరాబాద్: ఇండోనేషియా భూకంపం ప్రకంపనలు కోస్తాఆంధ్ర తీరంలో కన్పిస్తున్నాయి. అక్కడ సముద్ర గర్భంలో భూకంపం వచ్చిన కారణం అది మినీ సునామీగా పరిణమించే అవకాశాలున్నాయని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరించారు. భారత్ కు సునామీ ప్రమాదం లేదని కేంద్రప్రభుత్వం అభయం ఇచ్చినా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరాల్లో సమద్రపు అలలు ఎగిసిపడుతూ 50 నుంచి 100 మీటర్లు ముందుకు వస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని తీర ప్రాంతాల్లో సముద్రపు అలలు భయానకంగా ఎగిసిపడుతున్నాయి. కోస్తా జిల్లాల్లో మినీ సునామీ వచ్చే సూచనలు రావడంతో కలెక్టరు అప్రమత్తమై కంట్రోల్ రూమ్స్ ను ఏర్పాటు చేశారు.

ఇండొనేషియా భూకంపం తీవ్రత రిక్టార్‌స్కేల్‌పై 7.4గా నమోదయింది. సమత్రా దీవిలో సునామీ హెచ్చరికను జారీచేశారు. సముద్రంలో సంభవించిన ఈ భూకంపం వల్ల భారీస్థాయిలో సునామి అవకాశం లేదని, స్థానికంగా అంతగా ప్రభావం చూపని సునామి రావొచ్చునని యూనైటెడ్‌ స్టేట్స్‌ జీయోలాజికల్‌ సర్వే(యూఎస్‌ జీఎస్‌) తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+