గొంతు కోసి భార్యను చంపిన భర్త

Kadapa
కడప: కడప జిల్లా ప్రొద్దుటూరులోని బాలాజీ కాలనీలో ఓ భర్త తన భార్యను దారుణంగా హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన ప్రొద్దుటూరులో తీవ్ర సంచలనం సృష్టించింది. బాలాజీ కాలనీలో నివాసం ఉంటున్న రహ్మతుల్లా అనే వ్యక్తి తన భార్య తలపై రోకలిబండతో మోది తర్వాత గొంతు కోశాడు. దీంతో ఆమె మరణించింది. ఈ సంఘటన సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత చోటు చేసుకుంది.

భార్యను హత్య చేసి రహ్మతుల్లా పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. డబ్బుల విషయంలో చెలరేగిన వివాదం కారణంగానే ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+