చత్తిస్ గఢ్ లో మళ్ళీ రెచ్చిపోయిన మావోలు

Maoists
ఛత్తీస్‌ గఢ్‌: ఛత్తీస్‌ గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఈ రోజు తెల్లవారుజామున మావోయిస్టులు చింతల్‌నార్‌ పోలీస్‌ స్టేషన్‌ పై దాడికి విఫలయత్నం చేశారు. అయితే మావోల దాడిని పోలీసులు ధీటుగా తిప్పికొట్టారు. పోలీసుల ప్రతిఘటనతో మావోయిస్టులు వెనుదిరిగారు.

గత నెలలో చత్తిస్ ఆరు చోట్ల నక్సలైట్లు మెరుపు దాడులకు దిగారు. ఓ సిఆర్పీఎఫ్ వాహనాన్ని మందుపాతరతో మావోయిస్టులు పేల్చేశారు. ఈ ఘటనలో 73 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. ఓ ఆపరేషన్ ముగించుకుని వస్తున్న వాహనాన్ని మావోయిస్టులు మందుపాతరతో పేల్చేశారు. దంతెవాడ జిల్లా తాడిమెట్ల అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. యాంటీ మైన్ వెహికిల్ ను నక్సలైట్లు పేల్చేశారు. దాదాపు 500 మంది జవాన్లు వెనక్కి వస్తుండగా పథకం ప్రకారం మావోయిస్టులు దాడులు చేశారు. సంఘటనా స్థలం నుంచి 73 మృతదేహాలను తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+