ఢిల్లీ దిగి వస్తుంది: చిరంజీవి

Chiranjeevi
కాకినాడ: రాష్ట్రం మొత్తానికి ఉపయోగపడే పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు సాకారం కావడంలో నేతల స్వార్థ రాజకీయాలు అడ్డు పడుతున్నాయని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి విమర్శించారు.ఈ నెల 21న పోలవరంలో నిర్వహించే మహాసభతో ఢిల్లీ దిగి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు సాధన బస్సుయాత్ర మలివిడత తొలిరోజు పర్యటనలో భాగంగాచ మంగళవారం వివిధ ప్రాంతాల్లో పర్యటించి ప్రసంగించారు. పోలవరం ప్రాజెక్టుకు ఆర్నెల్లుగా టెండర్లు ఎందుకు పిలవలేదు? ఆరేళ్లుగా అవసరం రాని డిజైన్లలో మార్పు ఇప్పుడెందుకు? వీటన్నింటి గురించి నేను మాట్లాడితే రాజకీయం అంటున్నారని ఆయన అన్నారు. తానింకా వాళ్లంత ఎదగలేదని, తనకు మడతలు, రాజకీయ మతలబులు ఏమీ తెలియవన్నారు. పోలవరానికి జాతీయ హోదా రాదని తెలుగుదేశం నేత కడియం శ్రీహరి విమర్శించడాన్ని చిరంజీవి తప్పుపట్టారు. ఆయన కేవలం ఒక ప్రాంతం నేతగా మాట్లాడుతున్నారని, ఆంధ్రప్రదేశ్‌కే కాక ఛత్తీస్‌గఢ్‌, ఒరిస్సా వంటి రాష్ట్రాలకు ప్రయోజనం కలిగించే పోలవరం ప్రాజెక్టుకు చిత్తశుద్ధి కృషిచేస్తే జాతీయ హోదా ఎందుకు రాదని ప్రశ్నించారు.

జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన అన్ని ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం తక్షణం శ్వేతపత్రం విడుదల చెయ్యాలని చిరంజీవి డిమాండ్‌ చేశారు. తాజాగా 'కాగ్‌' నివేదికలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన పనుల్లో నిధుల వృధా, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు పేర్కొనడాన్ని ప్రస్తావిస్తూ...దీనిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చెయ్యాలన్నారు. రాష్ట్రంలో ఒక్క ప్రాంతానికి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్న తెరాస నేతలు, మొత్తం రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే తనను విమర్శించడం అర్థరహితమన్నారు. గతంలో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారపక్షంగా పదవులు అనుభవించిన ఆ పార్టీ తెలంగాణ కోసం, తెలంగాణ సోదరుల కోసం ఏం చేసింది? అని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+