జగన్ యాత్ర రాజకీయం కాదు: సురేఖ

Konda Surekha
వరంగల్: తమ పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో రాజకీయం లేదని, జగన్ యాత్రను రాజకీయాలతో ముడిపెట్టడం సరి కాదని మాజీ మంత్రి, కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ స్పష్టం చేశారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి మరణవార్తను తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను మాత్రమే జగన్ పరామర్శిస్తున్నారని ఆమె శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వరంగల్ జిల్లాలోని 73 కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ వస్తున్నట్లు ఆమె తెలిపారు.

సమైక్యాంధ్ర కోసం మరణించినవారి కుటుంబాలను జగన్ పరామర్శించడం లేదని, అందువల్ల తెలంగాణ కోసం మరణించినవారి కుటుంబాలను కూడా జగన్ పరామర్శించబోరని ఆమె చెప్పారు. అందువల్ల జగన్ పర్యటనకు రాజకీయ రంగు పులమడం మంచిది కాదని ఆమె అన్నారు. తెలంగాణ కోసం మరణించివారి కుటుంబాలను తాను త్వరలో పరామర్శిస్తానని ఆమె చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+