మహారాష్ట్ర వైపు నిందితుల పరారీ

ఇదిలా ఉంటే, హైదరాబాదులోని శాలిబండలో పోలీసులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల కేసును ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్ కు) బదిలీ చేసినట్లు నగర పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ చెప్పారు. దీంతో సిట్ విచారణ నిమిత్తం రంగంలోకి దిగింది. శుక్రవారం సాయంత్రం ఉగ్రవాదులు పోలీసులపైకి జరిపిన కాల్పుల్లో గాయపడిన కానిస్టేబుల్ రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. రమేష్ మృతదేహాన్ని చిత్తూరు జిల్లా మదనపల్లెకు చేర్చారు. అతని స్వగ్రామం గుట్టకిందపల్లెలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి.












Click it and Unblock the Notifications