సిట్ కు శాలిబండ ఫైరింగ్ కేసు

కాగా, శాలిబండ కాల్పుల కేసులో పోలీసులకు కీలకమైన ఆధారాలు లభించిట్లు తెలుస్తోంది. పక్కా పథకం ప్రకారమే ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు భావిస్తున్నారు. ముందు రెక్కీ కూడా నిర్వహించినట్లు పోలీసులు పసిగట్టారు. మధ్నాహ్నం నుంచి ఉగ్రవాదులు అక్కడి హోటల్లో మకాం వేసినట్లు గుర్తించారని అంటున్నారు. ఇదిలా వుంటే, సంఘటనా స్థలంలో టిజిఐకి చెందిన ఫసియుద్దీన్ పేర పోలీసులకు ఓ లేఖ దొరికింది. ఈ కాల్పులకు పాల్పడింది తామేనని అతను ఆ లేఖలో రాశాడు. గతంలో మక్కా మసీదులో కాల్పులకు బాధ్యులైన పోలీసులను శిక్షించే వరకు దాడులు చేస్తూనే ఉంటామని అతను చెప్పాడు.












Click it and Unblock the Notifications