అగ్గిపెడ్తాం, బుగ్గి చేస్తాం: కెసిఆర్

K Chandrasekhar Rao
హైదరాబాద్‌: తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఎలా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం తన ప్రకటనకు కట్టుబడి ఉండకపోతే మళ్లీ అగ్గి పెడ్తాం. తెలంగాణ ఇవ్వకపోతే వూరుకోం. ఇంట్లో కూర్చోబోం. అద్భుతమైన పోరాటానికి సిద్ధమవుదాం అని తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారమిక్కడ పార్టీ కార్యాలయంలో మహబూబ్‌ నగర్‌ జిల్లా కల్వకుర్తికి చెందిన పారిశ్రామికవేత్త ఠాగూర్‌ బాలాజీసింగ్‌ కేసీఆర్‌ సమక్షంలో తెరాసలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్‌ మాట్లాడుతూ మున్ముందు పెద్ద యుద్ధం ఉందని, పార్టీ సభ్యత్వాలను పూర్తిచేసి గ్రామస్థాయి నుంచి కమిటీలు వేసుకొని, సర్వసన్నద్ధమవుదామని చెప్పారు. తెలంగాణ సాధన కోసం గడిచిన పదేళ్లుగా తాను పక్షిలా తిరిగానన్నారు.

మన చేతిలో కత్తి పట్టుకొని ఇతరులను యుద్ధం చేయమనడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు తమ చేతిలో ఉన్న ఓటు అనే కత్తిని ఇతరులకు ఇచ్చి సమస్యలు పరిష్కరించమంటూ చిప్పపట్టుకొని అడుక్కోవడం బాగోలేదన్నారు. మన ఓట్లు మనమే వేసుకుని, మన సమస్యలు మనమే పరిష్కరించుకుందామని అన్నారు. ఆంధ్రా పెత్తనం ఉన్న పార్టీలు వద్దని, తెలంగాణలో వంద అసెంబ్లీ, మొత్తం పార్లమెంటు స్థానాలను గెలిపించుకుంటే కేంద్రం దిగి వస్తుందని చెప్పారు.

డిసెంబరు తొమ్మిదో తేదీన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో అన్ని పార్టీల రంగు, దుర్నీతి, సంస్కారం తేలిపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిందని, అయితే దాన్ని రాజీనామాలతో అడ్డుకున్నారని అన్నారు. దేశంలోని అత్యంత దయనీయమైన, దగాపడ్డ జిల్లాల్లో పాలమూరు ఒకటని, ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు వల్ల అత్యధికంగా నష్టపోయింది ఈ జిల్లానే అని కేసీఆర్‌ చెప్పారు. ప్రణాళిక సంఘం కూడా దేశంలో అత్యంత వెనుకబడ్డ జిల్లాల్లో పాలమూరు ఒకటని చెప్పిందన్నారు. జిల్లాకు 54 టీఎంసీల నీటిని కేటాయిస్తే 10 టీఎంసీలే వినియోగించుకోగలుగుతున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+