ప్రకాశంలో రేపు చిరు బస్సు యాత్ర

సోమవారం రాత్రి 12 గంటలకు బాపట్ల నుంచి చీరాల ఐటీసీ అతిథి గృహానికి చిరంజీవి చేరుకుంటారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ముంతావారి సెంటర్‌లోని సాయికల్యాణ మండపంలో విలేకరులతో మాట్లాడతారు. మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యకర్తలు, నాయకులతో సమీక్షా సమావేశం.
సాయంత్రం 4 గంటలకు గడియార స్తంభం సెంటర్ నుంచి బస్సు యాత్ర ప్రారంభం. జాండ్రపేట, వేటపాలెం, పందిళ్లపల్లి, కడవకుదురు, చినగంజాం, ఉప్పుగుండూరు, రాచపూడి అడ్డరోడ్డు, దుద్దుకూరు, కొణికి, ఇంకొల్లు, దగ్గుబాడు, పూసపాడు అడ్డరోడ్డు, వంకాయలపాడు, నూతలపాడుల మీదుగా రాత్రి 10గంటలకు పర్చూరు చేరుకుంటారు.












Click it and Unblock the Notifications