రాజకీయం చేయడం లేదు: బాబు

రైతుల సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని ఆయన చెప్పారు. రైతు సమస్యలను కేంద్రం దృష్టికి తేవడానికి తాను ఢిల్లీ వచ్చినట్లు ఆయన తెలిపారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ను ఆయన కలుసుకున్నారు. రైతుల సమస్యలపై ఆయన పవార్ కు వివరించారు. సాయంత్రం నాలుగు గంటలకు వాణిజ్య శాఖ మంత్రి ఆనంద శర్మతో భేటీ అవుతారు. పొగాకు బోర్డుకు చైర్మన్ ను నియమించాలని ఆయన ఆనంద శర్మను కోరుతారు. రాత్రి ఏడు గంటలకు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తో సమావేశమవుతారు.












Click it and Unblock the Notifications