జగన్ ది ఆధిపత్య యాత్ర: కోదండరామ్

Kodandaram
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా, తెలంగాణపై ఆధిపత్యం కోసం కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వరంగల్‌ జిల్లాలో యాత్ర చేయాలనుకుంటున్నారని తెలంగాణ రాజకీయ, ప్రజా సంఘాల జెఎసి కన్వీనర్ కోదండరామ్ విమర్శించారు. జగన్ చేయబోతున్నది ఓదార్పుయాత్ర కాదని, ఆధిపత్య యాత్ర అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమం బలహీనపడిందని, అసలు ఉద్యమమే లేదని చెప్పడానికీ, తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకూ సీమాంధ్ర సంపన్నవర్గాలు యాత్రల పేరుతో ఇక్కడికి వస్తున్నారని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఇలాంటి ఆధిపత్య యాత్రలు తెలంగాణ ప్రజలను భావోద్వేగాలకు గురిచేస్తున్నాయని, ప్రజల మధ్య విద్వేషాలకు కారణమవుతున్నాయని ఆయన అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి యాత్రలకు అనుమతి ఇవ్వరాదని కోరారు. జగన్ వరంగల్‌లో యాత్ర నిర్వహిస్తే తీవ్రపరిణామాలు సంభవించే అవకాశం ఉందన్నారు. అన్నిరకాల పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం, జగనే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం తెలంగాణ హక్కుల కోసం జరిగే యాత్రలకు అనుమతులు ఇవ్వడంలేదని, అదే తెలంగాణలో సీమాంధ్ర సంపన్నవర్గాలు చేస్తున్న ఆధిపత్య యాత్రలకు మాత్రం అనుమతులు ఇస్తోందన్నారు. ఇది వివక్ష కాదా అని ఆయన ప్రశ్నించారు. జగన్‌ వరంగల్‌లో యాత్ర తలపెట్టడంతో ఉద్వేగానికిలోనై, పర్యటనకు నిరసనగా రాజ్‌కుమార్‌ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారని, యాత్రనే ఆయనను ఆత్మహత్యకు పురికొల్పినందున అందుకు జగనే కారకుడని, ఆయనపై పోలీసు కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణ ఉద్యమం కోసం తమ ప్రాణాలను బలిదానం చేసిన అమరవీరులను ఆదుకుంటామని ఐకాస అధికార ప్రతినిధి, తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూవరంగల్‌ జిల్లాలో 40 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+