రుచించకనే తెలంగాణ గొడవ: రోశయ్య

Rosaiah
హైదరాబాద్: ప్రజల సమస్యల పరిష్కారం రుచించక, మంచి కార్యక్రమాన్ని ఆస్వాదించే స్వభావం లేక గొడవకు దిగుతున్నారని ముఖ్యమంత్రి కె. రోశయ్య తెలంగాణవాదులపై మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా యాచారం గ్రామంలో ఆయన సోమవారం రైతు చైతన్య యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగాన్ని తెలంగాణవాదులు అడ్డుకున్నారు. దీనిపై ముఖ్యమంత్రి తీవ్రంగా ప్రతిస్పందించారు. ఇది పురాణ కాలం నుంచి ఉందేనని, ఇప్పుడు కొత్తేమీ కాదని, ఈ ప్రాంతానికి ఇంత వరకు ఎవరూ రాలేదనీ మీరు వచ్చారని సంతోషంగా ఉందని అందరూ అంటున్నారని ఆయన అన్నారు. తెలంగాణవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణపై అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకునేందుకే కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని వేసిందని, ఈ విషయంలో తొందరపాటు తగదని ఆయన అన్నారు. రైతు చైతన్య యాత్ర అంటే రైతులకు వ్యవసాయ సమయం ఆసన్నం కాబోతుందనే సూచన అన్నారు. ఈ రైతు చైతన్య యాత్రలు జూన్ 2వ తేదీ వరకు జరుగుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+