కోరికలు వేరు: చిన జీయర్ స్వామి

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు పైలెట్ కావాలని మంచి కోరిక ఉండేదని, అయితే అన్ని కోరికలు నెరవేరడం సాధ్యపడదని అన్నారు. కాగా, డాక్టర్లు భగవంతుడి స్వరూపమని అన్నారు. శిశువు గర్భంలో ఉన్నప్పటినుంచే సరైన రీతిలో మలచగలిగే శక్తి వారికి మాత్రమే ఉందన్నారు. సైన్స్ టెక్నాలజీని జాగ్రత్తగా వాడుకోగలిగితే ఎలాంటి లోపాలు లేని బిడ్డలను అందించవచ్చని సూచించారు. నగర మేయరు బండ కార్తీకరెడ్డి మాట్లాడుతూ ఇలాంటి ఆస్పత్రులు తమ డివిజన్‌లో ఉండడం శుభపరిణామమని అన్నారు.
ఆస్పత్రి యజమానులు పేదవారికి కూడా అందుబాటులో ఉండేలా చికిత్స చేయాలని సూచించారు. ఆస్పత్రి ఎండీ సంజయ్‌రావు మాట్లాడుతూ పిల్లలకు వచ్చే అన్ని రకాల జబ్బులకు ఆస్పత్రిలో చికిత్స ఉందని చెప్పారు. జీరో ఏజ్ గ్రూప్ నుంచి 16 సంవత్సరాల్లోపు పిల్లలందరికీ చికిత్స లభిస్తుందన్నారు. నిరుపేదలకు చేయూతినిచ్చే విధంగా ఆరోగ్యశ్రీ అవకాశం కూడా ఉందన్నారు. కార్యక్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ ఎం.సత్యనారాయణ, పీసీసీ కార్యదర్శి బండ చంద్రారెడ్డి, మై హోం చైర్మన్ జె.రామేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ కమలాకర్ రావు, సురవరం సుధాకర్‌రెడ్డి, బిక్షమయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications