అయేషా కేసు: సత్యంబాబు పరారీ

Ayesha
విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడ విద్యార్థిని అయేషా హత్య కేసు నిందితుడు సత్యంబాబు పోలీసుల కళ్లు గప్పి పారిపోయాడు. పది మంది పోలీసు ఎస్కార్టు కళ్లు గప్పి సత్యంబాబు పారిపోయినట్లు విజయవాడ పోలీసు కమిషనర్ సీతారామాంజనేయులు ధ్రువీకరించారు. శుక్రవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో నల్లగొండ జిల్లా సూర్యాపేటలో అతను పారిపోయినట్లు చెబుతున్నారు. భోజనానికి సూర్యాపేటలో ఆగినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుందని అంటున్నారు.

హైదరాబాదు నుంచి విజయవాడకు తీసుకుని వెళ్తుండగా సత్యంబాబు పరారైనట్లు పోలీసులు తెలిపారు. కాగా, సత్యంబాబు పరారీపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సత్యంబాబు పరారీ కట్టుకథ అని అతని తల్లి మరియమ్మ అంటోంది. సత్యంబాబు నరాల వ్యాధితో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్నాడు. దానివల్ల అతను పారిపోయాడంటే నమ్మకం కుదరడం లేదని అంటున్నారు. నరాల వ్యాధికి హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు అతనికి హైదరాబాదులోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో చికిత్స చేయిస్తున్నారు. నిమ్స్ నుంచి విజయవాడ తీసుకెళ్తుండగా సత్యంబాబు పారిపోయాడని అంటున్నారు.

పోలీసుల నిర్లక్ష్యం వల్లనే సత్యంబాబు పారిపోయాడని విజయవాడ పోలీసు కమిషనర్ సీతారామాంజనేయులు అంటున్నారు. ఇందుకు బాధ్యులైన పది మంది పోలీసులను ఆయన సస్పెండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+