జగన్ తీరుపై సోనియా సీరిసయస్

YS Jagan
న్యూఢిల్లీ: తమ పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తీరుపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ సీరియస్ గా ఉన్నారు. రాష్ట్రంలో వైయస్ జగన్ కు, ముఖ్యమంత్రి కె. రోశయ్యకు సంక్షేమ పథకాల విషయంలో తలెత్తిన వివాదం ఢిల్లీకి చేరింది. అధిష్టానం తప్పు చేస్తే తాము నిలదీస్తామని జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి, గుర్నాథ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి, మాజీ శాసనసభ్యుడు బాజీ గోవర్దన్ రెడ్డి చేసిన ప్రకటనపై పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. పూర్తి సమాచారం తీసుకోవడానికి ముఖ్యమంత్రి కె. రోశయ్యను, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ను పార్టీ అధిష్టానం ఢిల్లీకి పిలిపించింది.

సాక్షి వార్తాకథనాలపై, జగన్ ప్రసంగాలపై రోశయ్య వివరంగా సోనియాకు వివరించే అవకాశం ఉంది. సాక్షి వార్తాకథనాల ఆంగ్ల అనువాదాలను కూడా ఆయన సోనియాకు అందించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. జగన్ వర్గానికి చెందినవారిని ముందస్తుగా పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ హెచ్చరించారు. సోనియానే ప్రశ్నిస్తారా అంటూ నిలదీశారు. అటువంటివారిపై చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. తాను సంక్షేమ పథకాలను కొనసాగిస్తానని ప్రకటనలు చేస్తున్నప్పటికీ జగన్ విమర్సలు చేస్తున్నారు. జగన్ వర్గానికి ఆదిలోనే కళ్లెం వేయకపోతే నష్టం వాటిల్లుతుందని రోశయ్య సోనియాకు చెప్పనున్నట్లు సమాచారం.

తాను స్వేచ్ఛగా పని చేయడానికి మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కూడా రోశయ్య సోనియాను కోరే అవకాశం ఉంది. నామినేటెడ్ పోస్టుల భర్తీకి కూడా అనుమతి ఇవ్వాలని ఆయన కోరే అవకాశం ఉంది. రెండు రోజుల పాటు రోశయ్య, డిఎస్ ఢిల్లీలోనే ఉంటున్నారు. జగన్ వర్గానికి ఏదో విధంగా కళ్లెం వేయకపోతే పార్టీకి నష్టం జరుగుతుందని వారు అధిష్టానానికి ఫిర్యాదు చేస్తారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+