పిఎంగా రాహుల్ పై పార్టీదే నిర్ణయం: పిఎం

టెలికం వ్యవహారంలో అవినీతి జరిగినట్లు నిర్ధారణ అయితే చర్యలు తప్పవని ఆయన అన్నారు. సిబిఐని తాము రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. అఫ్జల్ గురు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన అన్నారు. మాయావతి నాయకత్వంలోని బిఎస్పీతో ఏ విధమైన ఒప్పందాలు లేవని ఆయన చెప్పారు. జనగణనలో కుల వివరాలు చేర్చే విషయంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన చెప్పారు. వారసత్వ సమస్యపై తాను ఆందోళన చెందడం లేదని, దానికి సంబంధించిన విషయంపై చరిత్రకారులు చెప్పాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications