ముంబై: అంబానీ సోదరుల శాంతి ఒప్పంద ప్రయత్నం స్టాక్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపింది. సోమవారం సెన్సెక్స్ ఒక్కసారిగా 280 పాయింట్లు పెరిగింది. విభేదాలకు స్వస్త చెప్పాలని, ఆరోగ్యకరమైన పోటీకి మాత్రమే దిగాలని అనిల్ అంబానీ, ముకేష్ అంబానీ సోదరులు నిర్ణయించుకున్నారు. గ్యాస్ కేటాయింపులపై చర్చలు జరపాలని కూడా నిర్ణయించుకున్నారు. దీని ప్రభావం స్టాక్ మార్కెట్ పై కనిపించింది.
రిలయన్స్ షేర్లు పెరుగుతున్నాయి. రిలయన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ షేర్ ధర 35 రూపాయలు పెరిగింది. ముకేష్ అంబానీకి చెందిన సంస్థల షేర్ల ధరలు మాత్రమే కాకుండా అనిల్ అంబానీ ఆర్ఎన్ఆర్ఎల్ సంస్థల షేర్ల ధరలు కూడా పెరుగుతున్నాయి.