వరంగల్ టిడిపి కార్పొరేటర్ల రాజీనామాకు

టీడీపీ ఫ్లోర్ లీడర్, వరంగల్ తూర్పు నియోజకవర్గ ఇన్ చార్జ్ గుండు సుధారాణి వైఖరికి నిరసనగా తాము రాజీనామా చేస్తున్నట్లు కార్పొరేటర్లు స్పష్టం చేశారు. పార్టీలో గ్రూపులను ప్రోత్సహిస్తూ, తమ ఎదుగుదలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సుధారాణి నిరంకుశ వైఖరితో మరికొన్ని కారణాలరీత్యా పార్టీని వీడుతున్నట్లు సుధారాణితో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబుకు లేఖ రాశారు. కార్పొరేటర్లు నాగపురి కల్పన, ఆమె భర్త, పార్టీ జిల్లా కార్యదర్శి నాగపురి సంజయ్ గౌడ్, బత్తిని వసుంధరతో పాటు ఆమె భర్త పార్టీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి బత్తిని చంద్రశేఖర్ పార్టీని వీడుతున్నట్లు ఆదివారం ప్రకటించడం చర్చనీయాం శంగా మారింది. కొంతకాలంగా వీరిద్దరి తీరుపై పార్టీలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల సందర్భంగా పార్టీ పక్షాన పోటీకి నిలి పిన కార్పొరేటర్ మున్నీకి వ్యతిరేకంగా వసుం ధర నామినేషన్ వేసిన విషయం పార్టీలో దుమా రం రేపింది. తాజాగా పార్టీ అర్బన్ జిల్లా కమిటీ ఎన్నికల్లో తమ మాట నెగ్గలేదనే అభిప్రాయం తో వారు రాజీనామా చేసినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. రాజీనామా చేసిన ఇద్దరు కార్పొరేటర్లు, నాయకులు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే బస్వరాజు సారయ్య నాయకత్వంలో కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్న ట్లు ప్రచారం సాగుతోంది. ఈ ఇద్దరు కార్పొరేటర్లు, నాయకులు తూర్పు నియోజకవర్గ పరిధిలోని రైల్వేగేటు దిగువ ప్రాంతానికే చెందిన వారు కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications