జగన్ యాత్రపై సోనియాకు ఫిర్యాదు

సోనియాకు లేఖను అందజేయడంతో ఆగకుండా ఐదుగురు కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు మంద జగన్నాథం, గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎస్ రాజయ్య, బలరాం నాయక్, వివేక్ మంగళవారం సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ను కలిసి జగన్ ఓదార్పు యాత్రను వాయిదా వేయించాలని కోరారు. వారు గంటకు పైగా అహ్మద్ పటేల్ తో మాట్లాడారు. విషయాలను రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీకి చెప్పాలని ఆయన వారికి సూచించారు. దీంతో వారు వీరప్ప మొయిలీని కలిసి అదే విజ్ఞప్తి చేశారు. తాము చెప్పిన విషయాల పట్ల మొయిలీ సానుకూలంగా ప్రతిస్పందించారని వారు మీడియాతో చెప్పారు.












Click it and Unblock the Notifications