సండే వరకు మండే ఎండలు!

Heat Waves
హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు సకాలంలో రాష్ట్రంలో ప్రవేశిస్తాయని శాస్త్రవేత్తలు అంచనా వేసినా ఈలోపు ఎండలు దంచికొట్టనున్నాయి. వాయవ్య భారత్ నుంచి వస్తున్న వేడి గాలుల ప్రభావం వల్ల ఉష్ణోగ్రతల ప్రభావం మరో రెండు రోజులు ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పారు. రాష్ట్రంలో ఆదివారం వరకు ఉష్ణోగ్రతలు ఉగ్రరూపంలో ఉంటాయని మరో అంచనా. అంటే సండే వరకు మండే ఎండలు ఉంటాయన్నమాట. రోహిణికార్తెలో ఎండలు ఇంత తీవ్రంగా ఉంటేనే వర్షాలు సమృద్ధిగా పడతాయి.

రాజస్థాన్‌ ఎడారుల నుంచి విదర్భ మీదుగా వీస్తున్న వేడిగాలులతో మూడు రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 5-6 డిగ్రీలు పెరిగాయి. ముఖ్యంగా తెలంగాణ జిల్లాలు నిప్పుల కొలిమే అయ్యాయి. ఉపరితల బొగ్గు గనులున్న కరీంనగర్‌ జిల్లా రామగుండంలో అత్యధికంగా 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పక్కనేఉన్న నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోనూ ఉష్ణోగ్రత 47 డిగ్రీలకు చేరింది. రాజధాని హైదరాబాద్‌లో 44 డిగ్రీలు నమోదైంది. వడదెబ్బకు తెలంగాణ జిల్లాల్లో 16 మంది, చిత్తూరు జిల్లాలో ఐదుగురు మరణించారు.

సకాలంలో వర్షాలు పడతాయన్న వార్తలు రైతులలో ఉత్సాహం నింపుతున్నాయి. నారుమళ్ళ కోసం వారు విత్తనాలని సిద్ధం చేసుకుంటున్నారు. జూన్ 1న రుతువవనాలు కేరళను తాకనున్నాయి. జూన్ 5 కల్లా రాష్ట్ర మంతటా విస్తరించనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+