కాంగ్రెసు కార్యకర్తగా యాత్ర చేపట్టలేదు: జగన్

తన ఓదార్పు యాత్ర కచ్చితంగా కొనసాగుతుందని, అది తన బాధ్యత అని, చనిపోయినవారు తన కుటుంబ సభ్యులని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించకపోతే తన తండ్రి పట్ల తగిన బాధ్యత నిర్వర్తించినట్లు కాదని ఆయన అన్నారు. ప్రాంతాలకు అతీతంగా తన ఓదార్పు యాత్ర సాగుతుందని ఆయన అన్నారు. తన అరెస్టు తర్వాత జరిగిన విధ్వంసకాండ పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాంతాలకు అతీతంగా అభిమానులు సంయమనం పాటించాలని, విధ్వంసానికి దిగవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉప ఎన్నికల కోసం ప్రజలను బలిపెట్టవద్దని, తన యాత్రను రాజకీయం చేయవద్దని తాను తెరాసకు విజ్ఞప్తి చేస్తానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications