హైకమాండ్ మాట బేఖాతర్: వైయస్ జగన్ యాత్ర షురూ

YS Jagan
హైదరాబాద్: పార్టీ అధిష్టానం మాటను ధిక్కరిస్తూ కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు తన ఓదార్పు యాత్రను ప్రారంభించారు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ ఎంతగా చెప్పినా జగన్ వినలేదు. ఆయన శుక్రవారం ఉదయం ఇఁటర్ సిటీలో వరంగల్ జిల్లాకు బయలుదేరారు. దీంతో అన్ని రైల్వే స్టేషన్లలో భారీగా పోలీసులను మోహరించారు. జగన్ యాత్రను అడ్డుకోవడానికి సమాయత్తమవుతున్న పలువురు తెలంగాణవాదులను పోలీసులు అరెస్టు చేశారు. జగన్ ఉదయం 11 గంటలకు మహబూబాబాద్ చేరుకుంటారు.

వైయస్ జగన్ వరంగల్ జిల్లాలో ఆరు రోజుల పాటు ఉంటుంది. ఆయన 72 గ్రామాల్లో పర్యటించి 77 కుటుంబాలను పరామర్శిస్తారు. ఆయన 1151 కిలోమీటర్లు పర్యటిస్తారు. ఆయన శుక్రవారం 11 కుటుంబాలను పరామర్శిస్తారు. మహబూబాబాద్ లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పటికే తెలంగాణవాదులు జగన్ ఫ్లెక్సీలను, పోస్టర్లను దగ్ధం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+