కెవిపిని డబ్బు వసూళ్లకు వాడుకుంటున్నారు: బాబు

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణిస్తున్నప్పటికీ పట్టించుకోని కేవీపీని శాంతిభద్రతల కమిటీ పదవినుంచి వెంటనే తప్పించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. పోలీసు అధికారుల్ని స్వార్థానికి వాడుకుంటున్న అధికారపక్షం వైఖరిని ఆయన తప్పుబట్టారు. తెలుగుదేశం కార్యకర్తలపై అధికారపక్షం చేస్తున్న దాడులను ఆయన ఖండించారు. దాడులను తాము అడ్డుకుంటామని ఆయన అన్నారు. తాము రెచ్చిపోతే కాంగ్రెసువాళ్లు మిగలరని ఆయన అన్నారు. శాంతిభద్రతల సమస్యను శాంతిభద్రతల సమస్యగానే చూడాలని, రాజకీయాలను రాజకీయాలుగానే చూడాలని, కానీ కాంగ్రెసు ప్రభుత్వం అలా వ్యవహరించడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications