హాయ్ ల్యాండ్ కన్నా మిన్నగా విజయవాడలో పర్యాటకం

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రవిబాబు మాట్లాడుతూ సింగ్‌నగర్‌లో వైయస్ రాజశేఖర రెడ్డి స్మృతివనం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని చెప్పారు. నగరంలో రాజీవ్‌పార్క్, రాఘవయ్యపార్క్, కృష్ణానదీ పరివాహక ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. చరిత్ర ప్రసిద్ధిగాంచిన దుర్గమ్మ ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారని చెప్పారు. వారు పర్యాటక కేంద్రాలన్నీ సందర్శించే విధంగా నగరంలో హాయ్‌ల్యాండ్‌ను రూపొందించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.
నగరంలో డిసెంబర్, జనవరి నెలల్లో బీఆర్టీఎస్ బస్సులు నడుస్తాయని మునిసిపల్ కమిషనర్ ఆశాభావం వ్యక్తం చేశారు. బస్సుల నిర్వహణ బాధ్యతను ఆర్టీసీ సమర్థవంతంగా చేపట్టగలదన్నారు. నగరంలో బీఆర్‌టీఎస్ బస్సులు రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావని ఆయన అన్నారు. ఆర్టీసీ ఆర్‌ఎం కోటేశ్వరరావు మాట్లాడుతూ విజయవాడ నుంచి హాయ్‌ల్యాండ్‌కు మూడు మెట్రో బస్సు సర్వీసులు ఏర్పాటుచేశామన్నారు. రైల్వేస్టేషన్, బస్టాండ్ మీదుగా హాయ్‌ల్యాండ్‌కు ప్రతి అరగంటకు ఒక బస్సు నడుపుతామని చెప్పారు. ఉదయం 7.30 గంటలకు నగరంలో మొదటి బస్సు బయలుదేరుతుందని, రాత్రి 10.30 గంటలకు హాయ్‌ల్యాండ్ నుంచి లాస్ట్‌బస్ బయలుదేరుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో డీటీసీ రఘునాథ్, హాయ్‌ల్యాండ్ ఎండీ ఆలూరి వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications