మేయర్ కార్తిక రెడ్డితో వైరం: కష్టాల్లో ఎమ్మెల్యే జయసుధ

మేయర్ కార్తిక రెడ్డి శుక్రవారం ఉదయమే ముఖ్యమంత్రి కె. రోశయ్యను కలిశారు. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) వార్డు కమిటీ సభ్యుల ఎన్నికపై తలెత్తిన వివాదంపై ఆమె ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చారు. ఈ స్థితిలో జయసుధ ఏం చేస్తారనే అర్థం కావడం లేదు. జయసుధ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు సన్నిహితురాలు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రోద్బలంతో ఆమె సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యారు. దాని వల్ల ముఖ్యమంత్రి వద్ద జయసుధకు సాన్నిహిత్యం తక్కువే ఉంటుంది. అందువల్ల జయసుధకు ఇరకాటంలో పడినట్లేనని భావించవచ్చు.












Click it and Unblock the Notifications