రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబుపై మండిపాటు

Chandrababu
హైదరాబాద్: రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక తీరుపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై పార్టీ సీనియర్లు మండిపడుతున్నారు. చాలా మంది సీనియర్లు రాజ్యసభ టికెట్లు ఆశించారు. అయితే అందరికీ ఆశాభంగం కలిగిస్తూ అనూహ్యంగా చంద్రబాబు సుజనా చౌదరిని, సుధారాణిని రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేశారు. దీంతో ఒక్కసారిగా అసమ్మతి సెగలు చంద్రబాబును చుట్టుముట్టాయి.

పార్టీ సీనియర్లు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అలక వహించారు. పార్టీనుంచి వెళ్లిపోతానని కూడా ఆయన హెచ్చరించినట్లు సమాచారం. మాకినేని పెదరత్తయ్య బహిరంగంగానే పార్టీ అభ్యర్థుల ఎంపిక తీరును వ్యతిరేకిస్తున్నారు. డబ్బులున్నవారినే రాజ్యసభకు ఎంపిక చేస్తున్నారని ఆయన చంద్రబాబుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన టి. దేవేందర్ గౌడ్ పేరు కూడా రాజ్యసభకు ప్రస్తావనకు వచ్చింది. చంద్రబాబు ఆయనను కూడా పక్కన పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+