వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్రంలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి

By Santaram
|
Google Oneindia TeluguNews

Warangal
చిత్తూరు, వరంగల్: రెండు వేర్వేరు జిల్లాల్లో పిడుగు పాటు కారణంగా శనివారం ముగ్గురు మృతిచెందారు. చిత్తూరు జిల్లా చెర్లోపల్లెకు చెందిన ఎం.సత్య(23), ఎన్‌.జీవ(15) అనే మేకల కాపరులు పిడుగుపాటుకు గురై మృతిచెందారు. వీరు శుక్రవారం మేకలతో వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. శనివారం వారు మృతిచెందినట్లు గుర్తించారు.

అదే విధంగా వరంగల్‌ జిల్లా మొగుళ్లపల్లి మండలం గుండ్ల కర్తికి చెందిన రైతు రవి (28) దుక్కిదున్నుతూ పిడుగుబారిన పడి ప్రాణాలు వదిలాడు. ఇలా ఉండగా నైరుతి రుతుపవనాలు శనివారం రాష్ట్రాన్ని పలుకరించాయి. రాయలసీమ, దక్షిణ కోస్తాలోని పలుప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. 24 గంటల్లోగా రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించవచ్చని వాతావరణశాఖ భావిస్తోంది. కేరళ, దక్షిణ తమిళనాడు, కర్ణాటక మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు కొన్ని చోట్ల చురుకుగా కదుతున్నాయి. కర్ణాటకలోని కన్నూరు, బెంగుళూరు మీదుగా రాయలసీమలోని కడప, దక్షిణ కోస్తాంధ్రలోని నెల్లూరు, బాపట్ల వరకూ విస్తరించినట్లు వాతావరణశాఖ తెలిపింది

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X