భోపాల్ గ్యాస్ లీకేజీ కేసులో 8 మంది దోషులు

భోపాల్ లోని అమెరికాకు చెందిన యూనియన్ కార్బైడ్ కర్మాగారం నంచి 1984 డిసెంబర్ 2వ తేదీన పెద్ద యెత్తున గ్యాస్ లీకైంది. రాత్రి పది గంటల సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది. ఈ దుర్ఘటనలో 15 వేల మంది దాకా మరణించారు. ఐదు లక్షల మంది దాకా శ్వాసకోశ సంబంధమైన వ్యాధులకు గురయ్యారు. వేలాది మంది వికలాంగులయ్యారు. గ్యాస్ లీకేజీ కేసులో అమెరికా, భారత్ లకు చెందిన యూనియన్ కార్బయిడ్ ఎగ్జిక్యూటివ్ లను కోర్టు దోషులుగా నిర్ధారించింది. అమెరికాలోని యూనియన్ కార్బయిడ్ చైర్మన్ కూడా దోషులుగా నిర్దారించినవారిలో ఉన్నారు. స్థానిక కోర్టు తీర్పును దోషులు హైకోర్టులో సవాల్ చేయనున్నారు.












Click it and Unblock the Notifications