హైదరాబాద్: తనను అడగకుండా కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు సలహా ఇవ్వబోనని కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. జగన్ తన కుమారుడిలాంటి వాడని, జగన్ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటానని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తాను శాసనసభ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తానని ఆయన చెప్పారు.
చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసు దగ్గర కావడం మంచి పరిణామమని ఆయన అన్నారు. పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తోరో, కాంగ్రెసుతో పొత్తు పెట్టుకుంటారో అది చిరంజీవి ఇష్టమని ఆయన అన్నారు.