ఓదార్పు యాత్రపై జగన్ కట్టడికే అధిష్టానం నిర్ణయం

YS Jagan
న్యూఢిల్లీ: తమ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్ర విషయంలో పట్టు సడలించకూడదనే ఉద్దేశంతోనే కాంగ్రెసు అధిష్టానం ఉంది. ఓదార్పు యాత్రకు అనుమతి సాధించేందుకు వైయస్ జగన్ తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నప్పటికీ అధిష్టానం ఏ మాత్రం పట్టు సడలించేందుకు సిద్ధంగా లేదని ఎఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ మాటలను బట్టి అర్థమవుతోంది. అధిష్టానం నిర్ణయం వాతావరణంలాగా మారదని ఆయన జగన్ ఓదార్పు యాత్రపై ఆయన ఆదివారం సాయంత్రం అన్నారు. పార్టీ నిజమైన కార్యకర్త ఎవరైనా అధిష్టానం నిర్ణయం మేరకే నడుచుకుంటారని, జగన్ కూడా నిజమైన కార్యకర్తగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.

కాగా, వైయస్ జగన్ ఏ మాత్రం అవకాశం ఉన్నా ఓదార్పుయాత్ర చేపట్టాలనే ఉద్దేశంతో అన్నారు. ఓదార్పు యాత్ర జరగదని ఆయన ఆదివారం అనంతపురంలో మీడియా ప్రతినిధులతో అన్నారు. కానీ, జగన్ ఓదార్పు యాత్ర చేపట్టడం అంత సులభంగా కనిపించడం లేదు. ఆయనకు అత్యంత సన్నిహితులైన నేతలు కూడా అధిష్టానం అనుమతి వచ్చే వరకు ఓదార్పు యాత్ర చేపట్టకపోవడమే మంచిదనే అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. వారి మాటలను జగన్ వినే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+