వైయస్ జగన్ పై ముఖ్యమంత్రి పరోక్ష చురక

కొత్త పథకాల ఆలోచన లేకుండా ఆచరణలో ఉన్న పథకాలను సమర్థంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. పల్లెల్లో ప్రాథమిక సౌకర్యాల కల్పన దేశాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ పరిసర జిల్లాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.50కోట్ల వ్యయంతో నూతన పథకం ప్రారంభించనున్నట్లు రోశయ్య వెల్లడించారు. కేంద్ర మంత్రులు జైపాల్ రెడ్డి, పనబాకలక్ష్మితో పాటు రాష్ట్రమంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, బొత్ససత్యనారాయణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications