మొగుడు పెళ్లాల గొడవ: జగన్ ఇష్యూపై నారాయణ

Narayana
గుంటూరు: కాంగ్రెసు నాయకత్వానికి, ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు మధ్య జరుగుతున్న వ్యవహారాన్ని మొగుడు పెళ్లాల గొడవ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ అభివర్ణించారు. అది కాంగ్రెసు ఇంటి సమస్య అని, అంతర్గతంగా పరిష్కరించుకోవాలని, దానికి ప్రజలతో ఏ విధమైన సంబంధం లేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఓదార్పు యాత్రకు అనుమతి ఉందని ఉదయం పూట కాంగ్రెసు నాయకత్వం అంటుంది, సాయంత్రం లేదంటుందనీ తాను ఓదార్పు యాత్ర చేపడతానని జగన్ ఓ సారి అంటారు, మరోసారి వాయిదా వేసుకుంటానని అంటారనీ ఆయన అన్నారు. ప్రజలకు సబంధం లేని విషయాన్ని ముందుకు తెస్తే ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన అన్నారు.

కావాలంటే కాంగ్రెసు నాయకత్వం జగన్ ను నియంత్రించాలని, లేదంటే దమ్ముంటే జగన్ తిరుగుబాటు చేయాలని, కానీ ప్రజలకు ఏ విధమైన సంబంధం లేని విషయాన్ని ముందుకు తేవడం సరి కాదని ఆయన అన్నారు. మద్యం అమ్మకాలను ప్రోత్సహించి ప్రజలను దెబ్బతీస్తున్న ముఖ్యమంత్రి రోశయ్యే ప్రథమ ముద్దాయని నారాయణ విమర్శించారు. మద్యాన్ని నియంత్రించాల్సిన ప్రభుత్వం దాన్నే ఆదాయవనరుగా బావిస్తూ, అవమాన పడాల్సి పోయి గర్వపడుతోందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ తీరు మారకుంటే ముందు ముందు మద్యం దుకాణాలను ధ్వంసం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+