శరద్ పవార్ తో చేతులు కలపనున్న వైయస్ జగన్

తనను కాంగ్రెసు నాయకత్వం ఇరకాటంలో పెడుతున్న స్థితిలో ఆంధ్రప్రదేశ్ లో అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న జగన్ ను చేరదీసి, కాంగ్రెసును నష్టపరచాలనేది శరద్ పవార్ ఎత్తుగడగా కనిపిస్తోంది. జగన్ కు, శరద్ పవార్ కు మధ్య ఇప్పటికే చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవార్ నోటి క్యాన్సర్ కు చికిత్స పొందుతున్నారు. ఆ తర్వాత కొంత కాలం అమెరికాకు వెళ్లి వస్తారు. ఆయన తిరిగి రాగానే ఆంధ్రప్రదేశ్ లో ఎన్సిపీ శాఖ జగన్ నాయకత్వంలో ఏర్పడుతుంది.
అధిష్టానాన్ని ధిక్కరించి ఈ నెల 8వ తేదీన ఓదార్పు యాత్రను చేపట్టాలని జగన్ అనుకున్నప్పటికీ పవార్ సూచన మేరకే దాన్ని వాయిదా వేసుకున్నారని సమాచారం. వచ్చే నెల 8వ తేదీన వైయస్ రాజశేఖర రెడ్డి జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో జగన్ నాయకత్వంలో ఎన్సీపి శాఖ ఆవిర్భవించే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications