తెలంగాణలో పోటీ చేయాలంటున్నారు: చంద్రబాబు నాయుడు

నక్సల్స్ అంశాన్ని కేవలం శాంతి భద్రతల అంశంగా చూసి సైన్యంతో పరిష్కారాలు వెదకడం సరికాదన్నారు. నక్స ల్స్ సమస్య పరిష్కారానికి తాత్కాలిక చర్యలతో పాటు దీర్ఘకాలిక చర్యల అవసరం కూడా ఉందన్నారు. విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇవ్వడాన్ని గిరిజనులు వ్యతిరేకిస్తున్నారని, వారిలోని ఆందోళనను నక్సల్స్ వినియోగించుకొంటున్నారని, ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తే ఆ ఆందోళన ఆగిపోతుందని అన్నారు. బాలకృష్ణ రాజకీయాల్లో రాణిస్తారని తానన్న మా టలకు వేరే అర్థాలు తీయరాదని కోరారు. బాలకృష్ణ ఎప్పుడూ పార్టీలోనే ఉన్నారని, పార్టీ కోసం ప్రచారం చేస్తున్నారని, పార్టీ కోసం పని చేయడానికి బాలకృష్ణ ఎప్పుడు వచ్చినా మేం స్వాగతిస్తామని, బాధ్యతలు అప్పగిస్తామని వివరించారు.












Click it and Unblock the Notifications